Work Permits: ఇకపై హెచ్1బీ వీసాదారుల జీవితభాగస్వాములకు వర్క్ పర్మిట్లు

  • హెచ్4 వీసాల నిలిపివేతకు ట్రంప్ సర్కారు ప్రయత్నం
  • అధికారంలోకి రాగానే ఇమ్మిగ్రేషన్ విధానంపై బైడెన్ చర్యలు
  • ట్రంప్ నిర్ణయాలపై పునఃసమీక్ష
  • హెచ్4 వీసాదారులకు ఊరట
  • హెచ్1బీ వీసాదారుల జీవితభాగస్వాములు ఉద్యోగం పొందే అవకాశం
Work permits for non immigrant workers spouses in US

అమెరికాకు విదేశీ నిపుణుల వలసలను నియంత్రించేందుకు గతంలో ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పూర్తిస్థాయిలో సమీక్షిస్తూ అవసరమైన మేరకు చర్యలు తీసుకుంటున్నారు. హెచ్4 వీసాలను నిలిపివేయాలన్న ట్రంప్ సర్కారు నిర్ణయంపై బైడెన్ సర్కారు నిశితంగా దృష్టి సారించింది.

ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్ విధానంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై హెచ్1బీ వీసాదారుల జీవితభాగస్వాములకు కూడా అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వర్క్ పర్మిట్లు జారీ చేయనున్నారు. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వం బిల్లు కూడా విడుదల చేసింది.

అమెరికాలో శాశ్వత నివాసం పొందేందుకు ఉపకరించే గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న హెచ్1బీ వీసాదారులు, ఆరేళ్ల పరిమితిపై పొడిగింపు పొందినవారి భాగస్వాములు (హెచ్4 వీసాదారులు) ఇకపై అమెరికాలో ఉద్యోగ అనుమతి పత్రం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆ బిల్లు వెసులుబాటు కల్పిస్తోంది. ఉద్యోగం కోసం మాత్రమే కాదు, వారు స్వయం ఉపాధి పొందేందుకు కూడా వీలు కలుగుతుంది. పైగా వారు సామాజిక భద్రత సంఖ్య, బ్యాంకు ఖాతాలు, డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు సాధ్యపడుతుంది.

More Telugu News