YS Sharmila: రెడ్లను కేసీఆర్ మోసం చేశారు.. షర్మిలకు మద్దతు ప్రకటిస్తున్నాం: రెడ్డి సంఘాల జేఏసీ

Telangana Reddy JAC supports YS Sharmila
  • రెడ్లకు రాజకీయంగా దిక్కు లేకుండా పోయిందన్న సత్యనారాయణ రెడ్డి
  • రెడ్లకు ప్రాధాన్యత తగ్గిపోయిందని ఆవేదన
  • షర్మిలతో రెడ్లకు పూర్వవైభవం వస్తుందని ధీమా
తెలంగాణలో వైయస్ షర్మిల జోరు పెంచుతున్నారు. కొత్త రాజకీయ పార్టీని పెడుతున్న ఆమె... వివిధ జిల్లాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఆమెకు మద్దతు పలుకుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించిన ఆమెకు... వైయస్ అభిమానులు అండగా నిలుస్తున్నారు. తాజాగా షర్మిలను రెడ్డి సంఘాల నేతలు కలిశారు. షర్మిల పెట్టబోతున్న పార్టీకి తమ సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పారు.

షర్మిలతో భేటీ అనంతరం రెడ్డి సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు నవల్ల సత్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని రెడ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని ఆయన అన్నారు. రాష్ట్రంలో రెడ్లకు రాజకీయంగా దిక్కు లేకుండా పోయిందని, ప్రాధాన్యత తగ్గిపోయిందని మండిపడ్డారు. రెడ్డి కార్పొరేషన్ ఇస్తామని చెప్పిన కేసీఆర్... ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు. షర్మిల పార్టీతో తెలంగాణలో రెడ్లకు పూర్వ వైభవం వస్తుందని అన్నారు. షర్మిలకు రాష్ట్రంలోని రెడ్లంతా మద్దతు పలుకుతారని చెప్పారు.
YS Sharmila
Reddy JAC
Satyanarayana Reddy

More Telugu News