ఏపీలో 620కి పడిపోయిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

19-02-2021 Fri 17:58
  • గత 24 గంటల్లో 26,526 కరోనా పరీక్షలు
  • 79 మందికి పాజిటివ్
  • చిత్తూరు జిల్లాలో 16 కేసులు
  • 77 మందికి కరోనా నయం
  • విశాఖ జిల్లాలో ఒకరి మృతి
Corona active cases number declines in AP

ఏపీలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఏపీలో కరోనాతో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 620 మాత్రమే. గడచిన 24 గంటల్లో 26,526 కరోనా పరీక్షలు నిర్వహించగా 79 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 16 మందికి కరోనా సోకింది. నెల్లూరు జిల్లాలో 12, అనంతపురం జిల్లాలో 11 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 77 మంది కరోనా నుంచి కోలుకోగా, విశాఖ జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,89,156 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,81,369 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,167కి చేరింది.