22 గజాల పిచ్ పై తుపాను సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు... అర్జున్ టెండూల్కర్ పై సోదరి ధీమా

19-02-2021 Fri 16:14
  • నిన్న ఐపీఎల్ వేలం
  • అర్జున్ ను కొనుగోలు చేసిన ముంబయి ఇండియన్స్
  • కనీస ధర రూ.20 లక్షలకే కొనుగోలు
  • క్రికెట్ అనేది నీ రక్తంలోనే ఉందన్న సారా టెండూల్కర్
  • ఇది నువ్వు సాధించిన ఘనత అంటూ వ్యాఖ్యలు
Sara Tendulker wishes her brother Arjun Tendulker best in IPL

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ తాజా సీజన్ లో అరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. నిన్న నిర్వహించిన వేలంలో అర్జున్ టెండూల్కర్ ను ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ కనీస ధర రూ.20 లక్షలతో కొనుగోలు చేసింది. దీనిపై అర్జున్ టెండూల్కర్ సోదరి సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో స్పందించింది.

 "ఇది నీ ఘనత. దీన్ని నీ నుంచి ఎవరూ తీసుకోలేరు. క్రికెట్ అనేది నీ రక్తంలోనే ఉంది" ఉని సోదరుడ్ని ఉత్సాహపరిచింది. "ఇన్నాళ్లు నెట్స్ లో సాధన చేసి ఉన్నత క్రికెటర్ అయ్యాడు. ఇక 22 గజాల పిచ్ పై తుపాను సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు" అని వివరించింది.