ఈసారి కౌన్సిలర్ గా నిలబడుతున్నా... ఐదేళ్లు ఇంకే పదవీ వద్దు: జేసీ ప్రభాకర్ రెడ్డి
- మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు జేసీ వెల్లడి
- ప్రజాసేవే తనకు ముఖ్యమని ఉద్ఘాటన
- ప్రజలు తనవైపే ఉన్నారని ధీమా
- తనకు ఏ కోరికలు లేవని స్పష్టీకరణ
తనకు 68 ఏళ్లని, తనకు ఏ కోరికలు లేవని జేసీ చెప్పారు. ప్రజాసేవే తనకు ముఖ్యమని, ఇంతకుముందు కూడా చేసి చూపించానని ఉద్ఘాటించారు. ప్రజలు తనవైపే ఉన్నారని, పురపాలక ఎన్నికల్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ వాళ్లు పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపించారని, తాను తాడిపత్రిలో పుట్టినందుకు అక్కడి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.