SEC: ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలపై కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలు

  • ఏపీలో మరో విడత మిగిలున్న పంచాయతీ ఎన్నికలు
  • ఈ నెల 21న పోలింగ్
  • కౌంటింగ్ ప్రక్రియను రికార్డు చేయాలని ఎస్ఈసీ ఆదేశం
  • కౌంటింగ్ కేంద్రాల్లోకి ఇతరులను అనుమతించవద్దని స్పష్టీకరణ
SEC issues orders to district collectors

ఏపీలో మరొక్క విడత పంచాయతీ ఎన్నికలు మిగిలున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కేంద్రాలపై జిల్లాల కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియను మొత్తం రికార్డు చేయాలని స్పష్టం చేశారు. సున్నిత, అత్యంత సున్నిత పంచాయతీల్లో వెబ్ క్యాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు తప్పనిసరి అని తేల్చి చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.

అతి తక్కువ ఓట్ల తేడా ఉంటేనే రీకౌంటింగ్ జరపాలని స్పష్టం చేశారు. అది కూడా రీ కౌంటింగ్ ఒక్కసారి మాత్రమే చేయాలని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధం లేని వ్యక్తులను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించవద్దని, ఫలితాల లీకుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలను ఎన్నికల అధికారులు అమలు చేసి తీరాలని నిర్దేశించారు.

రాష్టంలో ఇప్పటివరకు మూడు విడతల ఎన్నికలు పూర్తి కాగా, చివరిదైన నాలుగో విడత ఎన్నికలు ఈ నెల 21న జరగనున్నాయి.

More Telugu News