దళితులపై వైకాపా నాయకుల దాడి జగన్ రెడ్డి పాలనకి అద్దం పడుతోంది: వీడియో పోస్ట్ చేసిన లోకేశ్

19-02-2021 Fri 11:00
  • దళితులపై వైఎస్ జ‌గ‌న్ దమనకాండ కొనసాగుతూనే ఉంది
  • లింగాపురం గ్రామంలో దళితులపై వైకాపా నాయకుల దాడి
  • ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఎన్నికల సంఘం చూడాలి  
lokesh slams jagan

వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌లు ప్రాంతాల్లో దాడులు, దౌర్జ‌న్యాలు కొన‌సాగుతున్నాయని ఆరోపించారు.

'దళితులపై వైఎస్ జ‌గ‌న్ దమనకాండ కొనసాగుతూనే ఉంది. గుంటూరు జిల్లా, అమరావతి మండలం, లింగాపురం గ్రామంలో దళితులపై వైకాపా నాయకుల దాడి జగన్ రెడ్డి అహంకార పాలనకి అద్దం పడుతోంది' అని లోకేశ్ విమ‌ర్శిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

'జాతి తక్కువ వాళ్లు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? నరికి చంపేస్తాం అంటూ బెదిరించి రాళ్లతో దళితులపై దాడి చెయ్యడం, ఇళ్లకు వెళ్లి బెదిరించడం దారుణం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను' అని లోకేశ్ ట్వీట్ చేశారు.

'కులం పేరుతో దూషించడమే కాకుండా, దళిత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, దాడులకు తెగబడ్డ వైకాపా గూండాలను కఠినంగా శిక్షించాలి. లింగాపురం గ్రామంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి' అని లోకేశ్ డిమాండ్ చేశారు.