జీఎస్టీలో మార్పునకు డిమాండ్.. 26న దేశవ్యాప్తంగా వాణిజ్య మార్కెట్ల బంద్

19-02-2021 Fri 10:36
  • జీఎస్టీలో క్రూరమైన నిబంధనలు
  • సమీక్ష నిర్వహించాల్సిందే
  • వ్యాపారులను ఈ నిబంధనలు దారుణంగా దెబ్బతీస్తున్నాయి
  • దేశవ్యాప్తంగా 1500 చోట్ల ధర్నాలు
CAIT Calls for markets bandh on 26th
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో మార్పును డిమాండ్ చేస్తున్న అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) ఈ నెల 26న దేశవ్యాప్తంగా వాణిజ్య మార్కెట్ల బంద్‌కు పిలుపునిచ్చింది. జీఎస్టీలోని క్రూరమైన నిబంధనలు వ్యాపారులను దారుణంగా దెబ్బతీస్తున్నాయని, వీటిపై సమీక్ష నిర్వహించాలని సీఏఐటీ డిమాండ్ చేస్తోంది.

వ్యాపారులకు వ్యతిరేకంగా ఉన్న నిబంధనలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు జీఎస్‌టీ మండలిని కోరింది. ఈ మేరకు 1,500 చోట్ల ధర్నాలు నిర్వహించనున్నట్టు సీఏఐటీ పేర్కొంది. దేశవ్యాప్త బంద్‌కు అఖిలభారత రవాణా సంక్షేమ సంఘం (ఏఐటీడబ్ల్యూఏ) మద్దతు ఇచ్చినట్టు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు.