పెట్రో ధరల పెరుగుదలపై ఊర్మిళ సెటైరికల్ ట్వీట్

19-02-2021 Fri 07:56
  • ‘అక్కడ్ బక్కడ్ బాంబే బో’ పాటను మార్చి ట్వీట్
  • దేశంలోని పలు ప్రాంతాల్లో వంద రూపాయలు దాటిన పెట్రోలు ధర
  • గుబులు రేపుతున్న పెట్రో ధరలు
Urmila goes akkad bakkad bambey bo as petrol price zooms

దేశంలో పెరుగుతూ పోతున్న పెట్రో ధరలపై బాలీవుడ్ సీనియర్ నటి, శివసేన నేత ఊర్మిళా మటోండ్కర్ సెటైరికల్‌గా స్పందించారు. చిన్నపిల్లలు పాడుకునే ‘అక్కడ్ బక్కడ్ బాంబే బో’ పాటలో మార్పులు చేసి ‘అక్కడ్ బక్కడ్ బాంబే బో.. డీజిల్ నబ్బే, పెట్రోల్ సౌ.. సౌ మే లగే ధాగా.. సిలిండర్ ఊచల్ కే భాగా’ అని ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది.

మరోవైపు, దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోలు ధర రూ.100 దాటేసింది. పెట్రో ధరలు పెరగడం నిన్నటికి వరుసగా పదో రోజు. నిన్న పెట్రోలుపై లీటరుకు 34 పైసలు, డీజిల్‌పై 32 పైసలు పెరిగింది. ఫలితంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్‌తోపాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో బ్రాండెడ్ పెట్రోలు ధర రూ. 100 మార్కును దాటేసింది. రాజస్థాన్‌లో రెగ్యులర్ పెట్రోలు ధర కూడా వంద రూపాయలు దాటేసి వాహనదారుల గుండెల్లో గుబులు రేపుతోంది.