హైదరాబాద్‌లో పలు ప్రాంతాలలో వర్షం.. పెరిగిన చలి!

19-02-2021 Fri 06:52
  • నిన్న సాయంత్రం నుంచే వాతావరణంలో మార్పులు
  • ఇబ్బంది పెట్టిన శీతల గాలులు
  • పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
Unexpected rain in Hyderabada last night

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గత రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. సాయంత్రం నుంచే శీతల గాలులు జనాలను కొంత ఇబ్బంది పెట్టాయి. రాత్రి ఒక్కసారిగా వర్షం పడడంతో చలి పెరిగింది.

ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, నాగోల్, సైదాబాద్, రామాంతపూర్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, అర్కేపురం, పురానాపూల్, బహదూర్‌పురా, దూద్‌బౌలి, లంగర్‌హౌస్, అత్తాపూర్, ఉప్పర్‌పల్లి, నాంపల్లి, ఖైరతాబాద్, జియాగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో నీళ్లు రోడ్లపైకి చేరాయి.