TTD: తిరుమలలో వైభవంగా ప్రారంభమైన రథసప్తమి వేడుకలు

  • నిత్య కైంకర్యాల అనంతరం వేడుకలు ప్రారంభం
  • ఏడు వాహనాలపైనా భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు
  • ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై దర్శనంతో మొదలు
Rathasapthami started at Tirumala Srivari Temple

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ తెల్లవారుజామున నిత్య కైంకర్యాలు పూర్తయిన అనంతరం ఉదయం 5.30 గంటలకు రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. స్వామి వారు నేటి ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. సూర్యప్రభ వాహనంతో మొదలయ్యే వేడుకలు చంద్రప్రభ వాహనంతో ముగుస్తాయి.

ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై, 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై, 11 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపైనా స్వామివారు దర్శనం ఇస్తారు. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు శ్రీవారికి చక్రస్నానం చేయిస్తారు.

సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కల్పవృక్ష వాహనంపైన, 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపైన, రాత్రి 8 గంటల నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనంపైన స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తారు.

More Telugu News