Venkaiah Naidu: రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ లెజెండ్ గా జీవించారు: వెంకయ్యనాయుడు

  • ఎన్టీఆర్ రాజకీయ జీవితంపై పుస్తకం
  • పుస్తకం రాసిన రమేశ్ కందుల
  • హైదరాబాదులో ఇవాళ ఆవిష్కరణ
  • కార్యక్రమానికి హాజరైన వెంకయ్యనాయుడు
Venkaiah Naidu lauds NTR a political legend

భారత ఉపరాష్ట్రప్రతి వెంకయ్యనాయుడు మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును వేనోళ్ల కీర్తించారు. ఎన్టీఆర్ రాజకీయజీవితం శోభాయమానం అని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ లెజెండ్ గా జీవించారని తెలిపారు. జాతీయస్థాయిలో ప్రతిపక్షాలను బలోపేతం చేసిన ఘనత ఎన్టీఆర్ దేనని అన్నారు. రాజకీయ సంస్కృతినే ఎన్టీఆర్ పునర్ నిర్వచించారని, ఎన్టీఆర్ రంగప్రవేశంతో రాజకీయాల రూపురేఖలు మారాయని పేర్కొన్నారు.

అయితే, ఎన్టీఆర్ కు చరిత్ర తగిన న్యాయం చేయలేదన్న అభిప్రాయాన్ని వెంకయ్య ఈ సందర్భంగా వెలిబుచ్చారు. 'మావెరిక్ మెస్సయ్య...' వంటి పుస్తకాలు మరిన్ని రావాలని, ఎన్టీఆర్ జీవితంలోని అనేక కోణాలు వెలుగులోకి రావాలని అభిలషించారు.

ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంపై పాత్రికేయుడు రమేశ్ కందుల రచించిన 'మేవరిక్ మెస్సయ్య: ఏ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు' అనే పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, ప్రముఖ రచయిత, రాజకీయ విశ్లేషకుడు సంజయ్ బారు హాజరయ్యారు. "మేవరిక్ మెస్సయ్య .." అనే ఈ పుస్తకాన్ని రాండమ్ హౌస్ ముద్రణ సంస్థ ప్రచురించింది. ఈ పుస్తకావిష్కరణకు హైదరాబాదులోని హోటల్ దసపల్లా వేదికగా నిలిచింది.

More Telugu News