పోలీసుల అదుపులో అడ్వొకేట్ దంపతుల హత్య కేసు నిందితులు!

18-02-2021 Thu 17:45
  • పెద్దపల్లి జిల్లాలో అడ్వొకేట్ దంపతుల దారుణహత్య
  • పట్టపగలే హత్యకు గురైన వామనరావు, నాగమణి
  • నిందితులపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు
  • నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం
Police arrests advocate couple murder case accused

తెలంగాణలో అడ్వొకేట్ దంపతులు వామనరావు, నాగమణిలను దారుణంగా హత్యచేసిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్, అక్కపాక కుమార్, వసంతరావు, చిరంజీవిలను అరెస్ట్ చేసిన పోలీసులు, ఈ రాత్రికి వారిని మీడియా ముందు ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు వసంతరావును ఏ1గా, కుంట శ్రీనివాస్ ను ఏ2గా, కుమార్ ను ఏ3గా పేర్కొన్నారు.

నిన్న పెద్దపల్లి జిల్లా కల్వచర్లలో తమ వాహనంలో వెళుతున్న అడ్వొకేట్ దంపతులను మరో వాహనంలో వచ్చి అడ్డగించిన దుండగులు దారుణంగా నరికి చంపారు. పట్టపగలే జరిగిన ఈ హత్యాకాండ రోడ్డుపై వెళ్లే వాహనదారులను నిశ్చేష్టులను చేసింది.