Sensex: ప్రైవేట్ బ్యాంకులపై అమ్మకాల ఒత్తిడి.. ఈరోజు కూడా నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!

  • 379 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 89 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 8 శాతానికి పైగా లాభపడ్డ ఓఎన్జీసీ
Sensex loses 379 points

నిన్న భారీ నష్టాలను మూటకట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా అదే దారిలో పయనించాయి. ఈరోజు ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్రా తదితర ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో... మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 379 పాయింట్లు నష్టపోయి 51,324కి పడిపోయింది. నిఫ్టీ 89 పాయింట్లు కోల్పోయి 15,118కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (8.32%), ఎన్టీపీసీ (4.08%), ఏసియన్ పెయింట్స్ (3.50%), టెక్ మహీంద్రా (2.97%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.85%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-2.43%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.20%), నెస్లే ఇండియా (-2.18%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.13%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.08%).

More Telugu News