ఏపీలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

18-02-2021 Thu 14:43
  • ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు
  • ఫిబ్రవరి 25న నోటిఫికేషన్
  • మార్చి 4 వరకు నామినేషన్ల స్వీకరణ
  • మార్చి 8 వరకు ఉపసంహరణకు అవకాశం
  • మార్చి 15న పోలింగ్
Election schedule released for six MLA quota MLC seats

ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో 6 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం... ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు మార్చి 4న ఆఖరు తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 8వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. మార్చి 15న పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ఉంటుంది. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుపుతారు.