ఎన్నడూ నిజం చెప్పని విజయసాయిరెడ్డి పోస్కోతో ఒప్పందం రద్దయ్యే మార్గం చెప్పాలి: వర్ల రామయ్య

18-02-2021 Thu 13:25
  • విశాఖ ఉక్కు పరిశ్రమ అంశంలో మాటలయుద్ధం
  • కార్మికులతో కలిసి పోరాడతామన్న విజయసాయి
  • ఎంతవరకైనా వెళతామని వ్యాఖ్యలు
  • విజయసాయి ప్రగల్భాలు పలుకుతున్నాడన్న వర్ల
  • రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నాడని విమర్శలు
Varla Ramaiah demands Vijayasai Reddy should tell how to cancel deal with POSCO

విశాఖ ఉక్కు కర్మాగారం అంశంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులతో కలిసి వైసీపీ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తుందని, తాము ఎంతవరకైనా వెళతామని విజయసాయి ఇంతకుముందు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తుక్కు రాజకీయాలు కావాలో, వైసీపీ ఉక్కు సంకల్పం కావాలో ప్రజలే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వర్ల రామయ్య బదులిచ్చారు.

స్టీల్ ప్లాంటు ప్రైవేటు పరం కాకుండా చూడడం మనవల్ల కాదని సీఎం సెలవిస్తుంటే, ఈ చర్యకు సూత్రధారి అయిన ఏ2 విజయసాయిరెడ్డి మాత్రం తాను పాదయాత్ర చేస్తా, ఎంతవరకైనా వెళతా అని ప్రగల్భాలు పలకడం రాష్ట్ర ప్రజలను మోసగించడమేనని విమర్శించారు. ఎన్నడూ నిజం చెప్పని విజయసాయిరెడ్డి పోస్కోతో ఒప్పందం రద్దయ్యే మార్గం చెప్పాలని నిలదీశారు.