petrol: హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌ ధర రూ.93.64కి చేరిన వైనం

  • పెట్రోల్‌పై 34 పైసలు, డీజిల్‌పై 32 పైసలు పెంపు 
  • ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.89.88
  • ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.34
Petrol Diesel Price in Hyderabad

భార‌త్‌లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు వ‌రుస‌గా 10వ రోజు కూడా పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ రోజు పెట్రోల్‌పై 34 పైసలు, డీజిల్‌పై 32 పైసలు పెంచ‌డంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.89.88 కి చేరింది. అలాగే, లీటర్‌ డీజిల్‌ ధర రూ.80.27గా ఉంది.  

పది రోజుల్లో పెట్రోల్‌పై రూ.2.93 పెర‌గ‌గా, డీజిల్‌పై రూ.3.14 పెర‌గ‌డం గ‌మ‌నార్హం. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌ ధర రూ.93.64కి చేర‌గా, డీజిల్‌ ధర రూ.87.52గా ఉంది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.34కు చేర‌గా, డీజిల్‌ ధర రూ.87.32గా ఉంది.

రాజస్థాన్ లోని శ్రీగంగా నగర్‌లో లీటర్‌ పెట్రోల్ ఇప్ప‌టికే రూ.100కు చేరింది. ఆ రాష్ట్ర‌ పెట్రోల్‌ డీలర్ల సంఘం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల ప్ర‌భావం మిగ‌తా వ‌స్తువుల పెరుగుద‌లపై కూడా ప‌డుతుండ‌డంతో సామాన్యుడికి ఇబ్బందులు త‌ప్ప‌ట్లేవు. 

More Telugu News