సిరాజ్​ సంబరాలపై సచిన్​ ప్రశంసల వర్షం

18-02-2021 Thu 11:41
  • అశ్విన్ సెంచరీ కొట్టినప్పుడు సిరాజ్ సంబరాలపై స్పందన
  • ఆ వీడియోను ట్వీట్ చేసిన బ్యాటింగ్ మేస్ట్రో
  • తనను చూస్తుంటే గర్వంగా ఉందని కామెంట్
  • కలిసికట్టుగా ఆడడమంటే ఇదేనంటూ ట్వీట్
Sachin showers praises on Hyderabadi pacer Siraj

ఇంగ్లండ్ తో రెండో టెస్టులో సెంచరీ చేసినప్పుడు అశ్విన్ ఎంత సంబరపడ్డాడో ఏమో గానీ.. అంత కన్నా ఎక్కువగానే హైదరాబాదీ పేసర్ సిరాజ్ సంబరాలు చేశాడు. నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న అతడు.. అశ్విన్ ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేయగానే ఆనందంతో గాల్లోకి పంచ్ విసిరాడు. తాను వికెట్ తీస్తే ఎంత ఆనందించేవాడో.. అంత ఆనందపడ్డాడు.

దానిపై బ్యాటింగ్ మేస్ట్రో సచిన్ టెండూల్కర్ స్పందించారు. అశ్విన్ శతకం బాదినప్పుడు సిరాజ్ చేసుకున్న వేడుకల వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘‘అశ్విన్ శతకం చేసినప్పుడు సిరాజ్ సంబరపడిపోవడం నాకు ఆసక్తి కలిగించింది. దానిని నేను చాలా ఆస్వాదించాను. కలిసికట్టుగా ఆడడమంటే ఇదే. టీమ్ లోని ఓ సభ్యుడి విజయాన్నీ ఎంజాయ్ చేయడమే అసలైన టీమ్ ఆట. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది సిరాజ్’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. సచిన్ ట్వీట్ పై అశ్విన్ కూడా స్పందించాడు. టీమ్ కోసం కష్టపడే వ్యక్తి సిరాజ్ అని పేర్కొంటూ సచిన్ ట్వీట్ ను రీట్వీట్ చేశాడు.