కాల‌కేయుల దాడుల‌ను ఎదిరించారు.. టీడీపీ మ‌ద్ద‌తుదారులు బాహుబలులు: లోకేశ్

18-02-2021 Thu 11:17
  • వైసీపీ అరాచ‌కాలు, అక్ర‌మాలు, అన్యాయాలు
  • వారికి ఎదురొడ్డి గెలిచిన టీడీపీ మ‌ద్ద‌తుదారులు
  • అస‌లు సిస‌లైన గెలుపు మ‌న‌దే
lokesh slams ysrcp

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ నేత‌లు దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డ్డార‌ని, అయిన‌ప్ప‌టికీ వారిని వైసీపీ మ‌ద్ద‌తుదారులు బాహుబ‌లుల్లా ఎదుర్కొని నిలిచార‌ని టీడీపీ నేత నారా లోకేశ్ చెప్పారు.

'మూడో విడ‌త‌లోనూ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌లో వైసీపీ అరాచ‌కాలు, అక్ర‌మాలు, అన్యాయాల‌కు ఎదురొడ్డి గెలిచిన టీడీపీ మ‌ద్ద‌తుదారుల‌ను అభినందిస్తున్నాను. ప్ర‌జాస్వామ్యబ‌ద్ధంగా జ‌ర‌గాల్సిన‌ ఎన్నిక‌ల ప్ర‌కియ‌ని‌ వైసీపీ కాల‌కేయులు దాడుల‌తో యుద్ధంగా మార్చారు' అని లోకేశ్ ఆరోపించారు.

'వైకాపా కాలకేయుల అరాచ‌క పోరాటంలో గెలిచిన టీడీపీ మ‌ద్ద‌తుదారులు ఒక్కొక్క‌రు ఒక్కో బాహుబ‌లి. వైఎస్ జ‌గ‌న్ అధికారం అండ‌తో, అధికారులు ప్రేక్ష‌కులై చూస్తుండ‌గా వీరుల్లా పోరాడిన టీడీపీ కేడ‌ర్ సాధించిన విజ‌యాలు వైసీపీ బ‌ల‌వంతపు ఏక‌గ్రీవాల కంటే త‌క్కువ‌గా ఉన్నా అస‌లు సిస‌లైన గెలుపు మ‌న‌దే' అని లోకేశ్ తెలిపారు.