క్వీన్ ఎలిజబెత్ భర్త, బ్రిటన్ రాజు ఫిలిప్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

18-02-2021 Thu 09:56
  • ఫిలిప్ వయసు 99 సంవత్సరాలు
  • మరికొన్ని రోజులపాటు ఆసుపత్రిలోనే ఉంటారన్న బకింగ్‌హ్యామ్ ప్యాలెస్
  • గత నెలలో వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న రాజదంపతులు
UK queens husband Prince Philip admitted to hospital

అస్వస్థతకు గురైన బ్రిటన్ రాకుమారుడు ఫిలిప్ లండన్‌లోని కింగ్ ఎడ్వర్డ్ ఆసుపత్రిలో చేరారు. క్వీన్ ఎలిజబెత్-2 భర్త అయిన ఫిలిప్ వయసు 99 సంవత్సరాలు. వైద్యుడి సలహా మేరకే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ తెలిపింది. మరికొన్ని రోజులపాటు ఆయన ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటారని పేర్కొంది. బ్రిటన్‌లో కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రాణి ఎలిజబెత్‌తో కలిసి వెస్ట్ లండన్‌లోని విండ్సర్ రాజభవనంలోనే ఫిలిప్ ఉంటున్నారు. కాగా, గత నెలలో రాజదంపతులు ఇద్దరూ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు.