ఎన్ని సినిమాలు చేసినా రాని తృప్తి ఆ సేవల వల్ల లభించింది: సోనూ సూద్

18-02-2021 Thu 09:53
  • సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో కార్యక్రమం
  • సోనూ సూద్ కు అశ్వదళంతో స్వాగతం
  • పేదలకు సాయం చేయడంతో ఆనందం పొందానన్న సోనూ
Sonu Sood Says got Satisfaction in Lockdown lony

తాను ఎన్ని చిత్రాల్లో నటించినా రాని సంతృప్తి కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో లభించిందని నటుడు సోనూ సూద్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో జరిగిన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సోనూ సూద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్వదళంతో స్వాగతాన్ని అందుకున్న సోనూ, ఆపై ప్రసంగిస్తూ, పేదలకు అన్నపానీయాలు అందించడం, వారిని తన స్వస్థలాలకు చేర్చడం తనకెంతో సంతృప్తిని అందించాయని అన్నారు.

ఇదే సమయంలో సోనూ సూద్ సేవలను కొనియాడిన సీపీ సజ్జనార్, కరోనా, లాక్ డౌన్ సమయంలో ఆయన చేసిన సేవలు మరపు రానివని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్లాస్మా దాతలను, కరోనా కాలంలో పేదలకు సేవలందించిన వారిని ఆయన సన్మానించారు. గాయని స్మిత, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తదితరులు కూడా  పాల్గొన్నారు.