ఈ చిత్రంలో కనిపించే మనిషి అసలు మనిషే కాదట!

18-02-2021 Thu 09:28
  • మనిషి రూపంలో కేక్
  • సోషల్ మీడియాలో వైరల్
  • తయారు చేసిన బ్రిటన్ సంస్థ
Man Cake goes viral

ఇక్కడున్న చిత్రంలో ఓ మనిషి బెడ్ పై పడుకుని ఉన్నాడు. అతనికి ఓ యువతి కేక్ ను తినిపించేందుకు సిద్ధమవుతోంది. అంతవరకూ బాగానే ఉంది. పక్కనే ఓ బెడ్ ల్యాంప్, కొన్ని మందులు, చిత్రాలు, బెలూన్ లూ ఉన్నాయి. ఈ చిత్రం చాలా సాధారణంగా కనిపిస్తోంది. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఇది సాధారణ మనిషి చిత్రం కాదు. ఇది హైపర్ రియలిస్టిక్ కేక్ అట. మానవ రూపంలో తయారు చేసిన కేక్. సోషల్ మీడియాలో ఈ చిత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పిక్ కు 'ఇది ఒక కేకు' అని క్యాప్షన్ పెట్టిన ఓ సోషల్ మీడియా యూజర్, దీన్ని బ్రిటీష్ బేకరీ సంస్థ బెన్ కులెన్ తయారు చేసిందని చెప్పారు. ఇక దీనికి కొన్ని వేల లైక్ లు, కామెంట్లు వచ్చాయి.