సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

18-02-2021 Thu 07:22
  • మలయాళం నేర్చుకుంటున్న రాశిఖన్నా 
  • 'ఎఫ్ 3' తాజా షెడ్యూలు షూటింగ్ పూర్తి
  • 'పుష్ప'లో కీలక పాత్రలో మేఘా ఆకాశ్    
Rashikhanna learning Malayalam

*  ప్రస్తుతం కథానాయిక రాశిఖన్నా మలయాళం నేర్చుకుంటోందట. దీని గురించి ఆమె చెబుతూ, "తాజాగా మలయాళంలో భ్రమమ్ అనే సినిమా చేస్తున్నాను. గతంలో తెలుగు సినిమాలు చేసినప్పుడు తెలుగు, తమిళ సినిమాలు చేసినప్పుడు తమిళం నేర్చుకున్నాను. అలాగే ఇప్పుడు మలయాళం నేర్చుకుంటున్నాను. మలయాళ పదాలు పలకడం కొంచం కష్టమే అయినప్పటికీ, మొత్తానికి భాష మాత్రం నేర్చేసుకుంటాను" అని చెప్పింది.
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎఫ్ 3' చిత్రం రెండో షెడ్యూలు షూటింగ్ పూర్తయింది. ఈ షెడ్యూలులో ప్రధాన తారాగణం పాల్గొన్న కామెడీ సీన్లను చిత్రీకరించారు. ఇందులో తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
*  అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రంలో యువ కథానాయిక మేఘా ఆకాశ్ కూడా నటించనుంది. ఇందులో ఆమె బన్నీకి సోదరిగా కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి విదితమే.