రాముడి పేరుతో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారు: ఉద్ధవ్ థాకరే

17-02-2021 Wed 20:43
  • మోసపూరిత శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
  • ఈ విషయంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలి
  • ఈ నెల 22 నుంచి 27 వరకు శివ్ సంపర్క్ కార్యక్రమం
Fraudulent Elements Taking Money In Rams name says Uddhav Thackeray

అయోధ్య రామ మందిర నిర్మాణానికి డబ్బులు వసూలు చేస్తున్న కొన్ని మోసపూరిత శక్తుల పట్ల శివసైనికులు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. ఇదే అంశంపై ప్రజల్లో శివసేన నేతలు, కార్యకర్తలు చైతన్యాన్ని కలిగించాలని సూచించారు. బీజేపీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.

పార్టీ బేస్ ను మరింత విస్తరింపజేసేందుకు ఈ నెల 22 నుంచి 27 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 'శివ్ సంపర్క్' పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు థాకరే తెలిపారు. తమ సంకీర్ణ ప్రభుత్వం సాధించిన విజయాలను, పనులను ప్రజలకు వివరించాలని చెప్పారు.