అభిమానులు ఇంత ప్రేమను చూపిస్తారని అసలు ఊహించలేదు: నిధి అగర్వాల్

17-02-2021 Wed 20:24
  • నిధి అగర్వాల్ కు గుడి కట్టించిన తమిళ అభిమానులు
  •  విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఫ్యాన్స్  
  • గుడిని చదువుకి, నిర్వాసితులకు షెల్టర్ కోసం వినియోగించాలని విన్నపం
Nidhi Agerwals response on construction of her temple

తమ అభిమాన సినీ నటులపై తమిళనాడు ఫ్యాన్స్ ఏ స్థాయిలో అభిమానం చూపిస్తారో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంజీఆర్, ఖుష్బూ, హన్సిక, నమిత తదితరులకు గుడులు కట్టారు. తాజాగా యువనటి నిధి అగర్వాల్ కు కూడా గుడి కట్టించారు. గుడిలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసి, పాలాభిషేకం చేశారు. దీనిపై నిధి షాక్ అయింది. తనపై ఇంత ప్రేమను చూపిస్తారని అసలు ఊహించలేదని ఆమె తెలిపింది. ఈ అభిమానాన్ని జన్మజన్మలకు గుర్తు పెట్టుకుంటానని చెప్పింది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా లేఖను షేర్ చేసింది.

తన ఫ్యాన్స్ తనపై చూపించిన స్వచ్ఛమైన ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్నానని నిధి చెప్పింది. తన కోసం నిర్మించిన గుడిని చదువు, ఆహారం, నిర్వాసితులకు షెల్టర్ కోసం వినియోగించాలని కోరింది. మీ అందరి అభిమానం ముందు మరేదీ గొప్ప కాదని తెలిపింది.