Sensex: లాభాల స్వీకరణ.. భారీగా నష్టపోయిన మార్కెట్లు

  • 400 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 104 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2.80 శాతం నష్టపోయిన నెస్లే
Sensex loses 400 points

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. కొన్ని రోజులుగా మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో ఈ ఉదయం నుంచి మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 400 పాయింట్లు కోల్పోయి 51,703కి పడిపోయింది. నిఫ్టీ 104 పాయింట్లు పతనమై 15,208 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.39%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.04%), ఎన్టీపీసీ (1.33%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.12%), బజాజ్ ఆటో (0.94%).

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-2.80%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.61%), ఏసియన్ పెయింట్స్ (-2.48%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.48%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.46%).

More Telugu News