పుట్టిన రోజు సందర్భంగా రుద్రాక్ష మొక్క నాటిన సీఎం కేసీఆర్

17-02-2021 Wed 15:04
  • కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమం
  • రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైన కార్యక్రమం
  • సంతోష్ కుమార్ ను అభినందించిన కేసీఆర్
KCR planted Rudraksha sapling

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతమైంది. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ వినతి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఇందులో భాగస్వాములయ్యాయి. సంతోష్ కుమార్ వినతి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కోటి వృక్షార్చనలో స్వయంగా పాల్గొన్నారు. రుద్రాక్ష మొక్కను నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్ కుమార్ ను అభినందించారు.