Junior NTR: రోడ్డు ప్ర‌మాదాల్లో ఇద్ద‌రు కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయిన ఓ పౌరుడిగా ఇక్క‌డకు వ‌చ్చాను: ఎన్టీఆర్

I come here not as an actor sasy ntr
  • రహదారి భద్రత మాసంలో పాల్గొన్న ఎన్టీఆర్
  • ఇక్క‌డికి ఓ సినీన‌టుడిగా రాలేదు 
  • ఓ పౌరుడిగా ఇక్క‌డకు వ‌చ్చాను
  • ట్రాఫిక్, రహదారి భద్రతా నిబంధనలను పాటించాలి
సైబ‌రాబాద్ పోలీసుల‌ పెట్రోలింగ్ వాహ‌నాల‌ను టాలీవుడ్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ జెండా ఊపి ప్రారంభించిన విష‌యం తెలిసిందే. జాతీయ రహదారి భద్రత మాసంలో భాగంగా సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన‌ ప్రత్యేక కార్యక్ర‌మంలో ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ భావోద్వేగానికి గుర‌య్యారు.

'నేను ఇక్క‌డికి ఓ సినీన‌టుడిగా రాలేదు.. రోడ్డు ప్ర‌మాదాల్లో ఇద్ద‌రు కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయిన ఓ పౌరుడిగా ఇక్క‌డకు వ‌చ్చాను. ట్రాఫిక్, రహదారి భద్రతా నిబంధనలను పాటించ‌డం అన్నింటి క‌న్నా ముఖ్య‌మైన విష‌యం' అని ఎన్టీఆర్ చెప్పాడు.

అవ‌గాహ‌న కోసం పోలీసులు అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నార‌ని తెలిపాడు. ర‌హ‌దారుల‌పై అంద‌రూ ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను పాటించి మ‌ళ్లీ సుర‌క్షితంగా ఇంటికి వెళ్లాల‌ని పిలుపునిచ్చాడు. కాగా, కార్య‌క్ర‌మం ప్రారంభానికి ముందు ఎన్టీఆర్‌కు పోలీసులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.
Junior NTR
Tollywood
cyberabad
Hyderabad Police

More Telugu News