అమరావతి భూములను తాకట్టు పెట్టడం ఏంటీ?: కొల్లు ర‌వీంద్ర విమ‌ర్శ‌లు

17-02-2021 Wed 11:17
  • అమరావతి రాజధానిపై ఇంకా కక్ష తీరలేదా జగన్ గారు?
  • ఆవేమైన పులివెందుల భూములు అనుకున్నావా ?
  • ఇడుపులపాయ ఎస్టేట్ భూములు అనుకున్నావా ?
  • అమరావతి విషయంలో నీ ఆటలు సాగవు జగన్ రెడ్డి
kollu ravindra slams jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్, వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై ఏపీ మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అమరావ‌తి రాజ‌ధాని, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు.

'అమరావతి రాజధానిపై ఇంకా నీ కక్ష తీర‌లేదా జగన్ గారు? అమరావతి భూములను తాకట్టు పెట్టడం ఏంటీ? ఆవేమైన పులివెందుల భూములు అనుకున్నావా...? ఇడుపులపాయ ఎస్టేట్ భూములు అనుకున్నావా ? అమరావతి రాజధాని విషయంలో నీ ఆటలు సాగవు జగన్ రెడ్డి' అని కొల్లు ర‌వీంద్ర విమ‌ర్శించారు.
 
'మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్లు ఉంది ఏ2 విజయసాయిరెడ్డి వ్యవహారం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఊ కొట్టి నేడు స్టీల్ ప్లాంట్ కోసమంటూ విశాఖలో పాదయాత్ర చేస్తారని మీడియాకు లీకులు... కొంచమైన సిగ్గుండాలి విజయసాయిరెడ్డి' అని కొల్లు ర‌వీంద్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.