బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి రెండున్నర కిలోల బరువైన బంగారు చీర!

17-02-2021 Wed 11:16
  • కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అమ్మవారికి కానుక
  • ఈఓకు అందించిన మంత్రి తలసాని
  • కేసీఆర్ దేశానికి కూడా సేవ చేయాలన్న తలసాని
Golden Sarry Gift for Balkampet Ellamma

కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్, బల్కంపేటలో కొలువైన ఎల్లమ్మ అమ్మవారికి భక్తులు రెండున్నర కిలోల బంగారు చీరను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా సమర్పించారు. దాతలు కూన వెంకటేశ్ గౌడ్ తదితరులు ఈ చీరను తయారు చేయించారని తెలిపిన తలసాని, తెలంగాణ వాసులకు ఎల్లమ్మ తల్లి ఇలవేల్పుగా నిలిచిందని, అమ్మను దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని అన్నారు.

రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్న కేసీఆర్, భవిష్యత్తులో దేశానికి కూడా సేవ చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నపూర్ణ సమక్షంలో అమ్మవారికి బంగారు చీరను సమర్పించారు.