రేవంత్ రెడ్డిపై ఉపసభాపతి పద్మారావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

17-02-2021 Wed 11:02
  • లాలాపేట‌లో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప‌ద్మారావు
  • అటువైపుగా వెళ్లిన రేవంత్ రెడ్డి ర్యాలీ
  • ‘రేవంత్‌ ఉన్నడా? నాకు ఆయ‌న‌ బాగా దగ్గరోడు’ అన్న‌ ప‌ద్మారావు
padma rao interesting comments on revanth reddy

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై రాష్ట్ర‌ అసెంబ్లీ ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం రేవంత్ రెడ్డి ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల‌కు చెబుతూ, స‌భ‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నిన్న లాలాపేట మీదుగా తార్నాక వైపు రేవంత్‌రెడ్డి వాహన శ్రేణీ ర్యాలీగా వెళుతోన్న స‌మ‌యంలో అదే ప్రాంతంలో అక్క‌డ‌ టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్య‌క్ర‌మంలో ప‌ద్మారావు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతోన్న స‌మ‌యంలో రేవంత్ రెడ్డి ర్యాలీ వైపుగా చూస్తూ  
‘రేవంత్‌ ఉన్నడా? నాకు ఆయ‌న‌ బాగా దగ్గరోడు’ అని వ్యాఖ్యానించారు. దీంతో టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు అంతా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. కాగా, గ‌తంలో ప‌ద్మారావు తెలంగాణ మంత్రిగా ప‌ని చేసిన విష‌యం తెలిసిందే.