బెంగాల్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. కాంగ్రెస్ కూటమిలో కొత్త పార్టీ

17-02-2021 Wed 10:34
  • ముస్లిం మతపెద్ద సిద్దిఖీ నేతృత్వంలో ఐఎస్ఎఫ్ 
  • బీజేపీ, టీఎంసీపై పోరులో భాగం కావాలన్నదే తమ అభిమతమన్న సిద్దిఖీ
  • ఆర్జేడీ, ఇతర లౌకికవాద పార్టీలకూ ఆహ్వానం ఉందన్న అధీర్ రంజన్
ISF join Hands with Congress Alliance in West Bengal Ahead Of Polls

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా పురుడుపోసుకున్న ‘ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్).. కాంగ్రెస్-వామపక్ష కూటమి గూటికి చేరింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధురి తెలిపారు.

ఐఎస్ఎఫ్ ఒక్కటే కాదని, ఆర్జేడీ సహా ఇతర లౌకకవాద పార్టీలకు కూడా చోటు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోరు టీఎంసీ, బీజేపీ మధ్యే కాదని, ముక్కోణపు పోటీ తప్పదని అన్నారు. బీజేపీ, టీఎంసీపై పోరుకు లౌకికవాద కూటమిలో భాగం కావాలన్న ఉద్దేశంతోనే కూటమిలో చేరినట్టు ఐఎస్ఎఫ్ చీఫ్ అబ్బాస్ సిద్దిఖీ తెలిపారు.