మ‌రింత‌ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు!

17-02-2021 Wed 10:30
  • వరుస‌గా తొమ్మిదో రోజు పెరుగుద‌ల‌
  • ఢిల్లీలో‌ పెట్రోల్‌పై 25 పైసల పెంపు
  • ముంబైలో పెట్రోల్ ధర లీట‌రుకు రూ.96 
  • హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.93.10 
Petrol Diesel Price in Hyderabad

గ్లోబ‌ల్ మార్కెట్లో చమురు ధరల పెరుగుద‌ల కారణంగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా తొమ్మిదో రోజు కూడా పెరిగాయి. ఈ రోజు ఢిల్లీలో‌ పెట్రోల్‌పై 25 పైసలు పెరగడంతో లీటర్ ధ‌ర‌ రూ.89.54కు చేరింది. అలాగే,‌ డీజిల్‌పై 25 పైసలు పెరగ‌డంతో లీటర్ ధ‌ర‌ రూ.79.95గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర లీట‌రుకు రూ.96కు చేర‌డం గ‌మ‌నార్హం. అలాగే, అక్క‌డ లీట‌రు డీజిల్‌ ధర రూ.86.98 కి పెరిగింది.


హైదరాబాద్‌లోనూ పెట్రోల్ ధర లీట‌రు రూ.93.10కి చేర‌గా, డీజిల్‌ ధర లీట‌రుకు రూ.87.20కి పెరిగింది. బెంగళూరులో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.92.54గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర రూ.84.75గా ఉంది. దేశంలో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు ప్ర‌తి రోజు పెరిగిపోతుండ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.