'రాధే శ్యామ్'లో ప్రభాస్ తో నేనిలా: కృష్ణంరాజు

17-02-2021 Wed 10:11
  • జులై 30న విడుదల కానున్న రాధే శ్యామ్
  • ప్రభాస్ తో కలసి వున్న చిత్రాన్ని పోస్ట్ చేసిన కృష్ణంరాజు
  • కాలంలో వెనక్కి వెళ్దామని వ్యాఖ్య
Krishnam Raju Tweet on Rahdeshyam

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రాధే శ్యామ్' జులై 30న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా నటిస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో, సెట్ లో ప్రభాస్ తో కలసి దిగిన ఓ చిత్రాన్ని కృష్ణంరాజు ట్వీట్ చేశారు. చేతులపై తల వెనక్కు పెట్టుకుని, స్టయిల్ గా ఆకాశంవైపు చూస్తున్న వీరిద్దరి చిత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. "జూలై 30న 'రాధే శ్యామ్'తో కాలంలో వెనక్కి వెళ్దాం" అని తన ట్వీట్ కు కృష్ణంరాజు కామెంట్ పెట్టారు.