సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

17-02-2021 Wed 07:29
  • గోపీచంద్ సినిమాలో అనసూయ
  • ప్రొడ్యూసర్ గా మారుతున్న రవితేజ
  • దర్శకుడిగా వస్తున్న స్టంట్ మాస్టర్  
Anasuya signs one more movie

*  ప్రస్తుతం సినిమాలలో బిజీగా వున్న హాట్ యాంకర్ అనసూయ తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పినట్టు సమాచారం. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న పక్కా కమర్షియల్ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి విదితమే.
*  ఇటీవల 'క్రాక్' సినిమా విజయంతో మంచి దూకుడు మీదున్న రవితేజ త్వరలో నిర్మాతగా కూడా మారుతున్నాడు. చిన్న బడ్జెట్ చిత్రాలను, ఓటీటీ కోసం వెబ్ సీరీస్ ను తాను నెలకొల్పనున్న బ్యానర్ పై నిర్మిస్తాడట. ప్రస్తుతం వీటికి సంబంధించిన పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
*  పలువురు స్టార్ హీరోల చిత్రాలకు యాక్షన్ దృశ్యాలను కంపోజ్ చేసిన ప్రముఖ స్టంట్ మాస్టర్ సెల్వ దర్శకుడిగా మారుతున్నాడు. దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ సినిమాలలో కూడా సెల్వ స్టంట్ మాస్టర్ గా మొత్తం 100 సినిమాల వరకు పనిచేశాడు. యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రానికి ఆయన దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం.