Sureedu: రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు రణభేరి సభలో 'సూరీడు' ప్రత్యక్షం

YS Personal assistant Sureedu appears along with Revanth Reddy after a long time
  • వైఎస్ వ్యక్తిగత సహాయకుడిగా సూరీడుకి గుర్తింపు
  • వైఎస్ మరణంతో మీడియాకు దూరం
  • చాన్నాళ్ల తర్వాత దర్శనం
  • రేవంత్ తో ఫొటో దిగిన వైనం
  • చర్చనీయాంశంగా మారిన సూరీడు వ్యవహారం
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సూరీడు చాన్నాళ్ల తర్వాత దర్శనమిచ్చారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగింపు నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా రావిరాలలో నిర్వహించిన రాజీవ్ రైతు రణభేరి సభలో సూరీడు ప్రత్యక్షమయ్యారు.

వైఎస్ మరణం తర్వాత సూరీడు పెద్దగా బహిరంగ వేదికలపై కనిపించింది లేదు. మీడియాకు ఎంతో దూరంగా ఉంటున్నారు. అయితే, ఇవాళ రాజీవ్ రైతు రణభేరి సభ వేదికపై రేవంత్ సరసనే కనిపించిన సూరీడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. రేవంత్ తో ఫొటో కూడా దిగారు. ప్రస్తుతం సూరీడు అంశం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Sureedu
Revanth Reddy
Rajeev Rythu Ranabheri
YSR
Telangana

More Telugu News