ఏపీలో కొత్తగా 60 మందికి కరోనా పాజిటివ్

16-02-2021 Tue 19:27
  • గత 24 గంటల్లో ఏపీలో 24,311 టెస్టులు
  • చిత్తూరు జిల్లాలో 16 మందికి పాజిటివ్
  • నాలుగు జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • 615కి తగ్గిన యాక్టివ్ కేసుల సంఖ్య
  • 140 మందికి కరోనా నయం
Sixty people tested corona positive in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 24,311 కరోనా పరీక్షలు నిర్వహించగా 60 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 16 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. కృష్ణా జిల్లాలో 10, పశ్చిమ గోదావరి జిల్లాలో 8 కేసులు గుర్తించారు. విజయనగరం, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 140 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,959 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,81,181 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 615 మంది చికిత్స పొందుతున్నారు. మరణాల సంఖ్య 7,163గా నమోదైంది.