ఓటుకు నోటు కేసులో నిందితులపై అభియోగాలు నమోదు చేసిన ఏసీబీ కోర్టు

16-02-2021 Tue 17:56
  • అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు
  • సండ్ర వెంకటవీరయ్యపై గతంలోనే అభియోగాల నమోదు
  • తాజాగా రేవంత్ తదితరులపై అభియోగాల నమోదు
  • అభియోగాల్లో వాస్తవం లేదన్న రేవంత్ తదితరులు
ACB Court files charges on Revanth Reddy and others

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నిందితులపై ఏసీబీ న్యాయస్థానం అభియోగాలు నమోదు చేసింది. ఇవాళ జరిగిన విచారణలో రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ లపై అభియోగాలు నమోదు చేశారు. సండ్ర వెంకటవీరయ్యపై గతంలోనే అభియోగాలు నమోదు చేయడం తెలిసిందే.

తాజాగా, రేవంత్ తదితరులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 కింద ఈ అభియోగాల నమోదు చేపట్టారు. ఐపీసీ 120 (బి) రెడ్ విత్ 34 అభియోగం నమోదైంది. తమపై అభియోగాల్లో వాస్తవం లేదని రేవంత్, సెబాస్టియన్, ఉదయ్ సింహా తోసిపుచ్చారు. కాగా, ఈ నెల 19న సాక్షుల విచారణ షెడ్యూలు ఖరారు చేస్తామని ఏసీబీ కోర్టు వెల్లడించింది.