రేపు విశాఖ శారదా పీఠానికి సీఎం జగన్ రాక

16-02-2021 Tue 17:44
  • రేపటి నుంచి శారదా పీఠం వార్షికోత్సవాలు
  • ప్రత్యేక పూజల్లో పాల్గొననున్న సీఎం
  • ఐదు రోజుల పాటు వార్షికోత్సవాలు
  • స్వరూపానందేంద్ర ఆధ్వర్యంలో ఉత్సవాలు
CM Jagan will visit Sarada Peetham in Vizag

ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖలోని శ్రీ శారదా పీఠం వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగే ప్రత్యేక పూజల్లో ఆయన పాలుపంచుకుంటారు. కాగా, శారదా పీఠం వార్షికోత్సవాలను ఫిబ్రవరి 17 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

రేపు ఉదయం గురువందనంతో వార్షికోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం శ్రీలక్ష్మీ గణపతి, మేధా దక్షిణమూర్తి హోమాలు, ఈ నెల 18న మన్యుసూక్త, 19న భోగప్రాప్తి హోమాలు, 20న రుద్రహోమం, షణ్ముఖయాగం, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం నిర్వహిస్తారు. రాజశ్యామల మాత పూజల్లో భాగంగా లక్ష తులసి పూజ, లక్ష పుష్పార్చన, లక్ష బిల్వార్చన జరుగుతాయి.

ఈ ఉత్సవాలు స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్యర్యంలో నిర్వహిస్తామని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి వెల్లడించారు.