తన పెళ్లి వేడుకల నాటి ఫొటోలను పంచుకున్న ప్రియాంకా గాంధీ

16-02-2021 Tue 17:27
  • రాబర్ట్ వాద్రాతో ప్రియాంక పెళ్లి
  • 1997లో వివాహం
  • పెళ్లికి ముందు ఫూలోం కా గెహ్నా వేడుక
  • ఆడపడుచుతో ప్రియాంక ఫొటో
Priyanka Gandhi shares her pre wedding pics

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియంకా గాంధీ సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటోలు పంచుకున్నారు. వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాతో ప్రియాంక పెళ్లి 1997లో జరిగింది. తన పెళ్లికి సన్నాహకంగా నిర్వహించిన ఫూలోం కా గెహ్నా అనే కశ్మీరీ సంప్రదాయం సందర్భంగా తీయించుకున్న ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

 24 ఏళ్ల నాటి ప్రియాంక ఫొటోలకు నెట్టింట లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఆ ఫొటోలను షేర్ చేసిన కొన్ని గంటల్లోనే విశేష స్పందన లభించింది. ఫూలోం కా గెహ్నా అంటే పెళ్లికూతురిని పూలతో అందంగా అలంకరిస్తారు. ఈ వేడుక సందర్భంగా ప్రియాంక తన ఆడపడుచు మిచెల్ వాద్రాతో కలిసి ఉండడం ఓ ఫొటోలో చూడొచ్చు. కాగా మిచెల్ వాద్రా 2001లో జరిగిన కారు యాక్సిడెంట్లో కన్నుమూశారు.