నేడు నష్టాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

16-02-2021 Tue 16:46
  • ఆద్యంతం ఒడిదుడుకుల్లో నేటి మార్కెట్లు
  • బ్యాంకింగ్, ఐటీ రంగాలలో అమ్మకాలు
  • 49.96 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
Stock Market closes in red

నేటి ఉదయం లాభాలలో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి నష్టాలలో ముగిశాయి. ఒకవిధంగా చెప్పాలంటే, ఆద్యంతం నేటి మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. నిన్న భారీ లాభాలను ఆర్జించిన మదుపరులు నేడు అమ్మకాలకు మొగ్గుచూపారు.

 దీంతో ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్సియల్, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలలో అమ్మకాలు బాగా జరిగాయి. దీంతో సెన్సెక్స్ 49.96 పాయింట్ల నష్టంతో 52104.17 వద్ద.. నిఫ్టీ 1.25 పాయింట్ల నష్టంతో 15313.45 వద్ద ముగిశాయి.

ఇక నేటి ట్రేడింగులో జిందాల్ స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, అపోలో హాస్పిటల్స్, ఎస్ఆర్ఎఫ్, కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర షేర్లు లాభాలను ఆర్జించగా.. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, ఇన్ఫోసిస్, ఎమ్మారెఫ్, బజాజ్ ఫిన్సెర్ప్ తదితర కంపెనీల షేర్లు నష్టాలు పొందాయి.