Vanajeevi Ramaiah: వనజీవి రామయ్య ఆరోగ్య పరిస్థితి మెరుగు

  • ఇటీవల అస్వస్థతకు గురైన వనజీవి రామయ్య
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
  • మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలి ఏఐజీకి తరలింపు
  • రేపు డిశ్చార్జి చేసే అవకాశం
Vanajeevi Ramaiah health condition is stable

మొక్కలు నాటడాన్ని ప్రాణప్రదంగా భావించే వనజీవి రామయ్య ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆసుపత్రి పాలైన రామయ్య కోలుకుంటున్నారు. గత 50 ఏళ్లుగా మొక్కలు నాటుతున్న రామయ్య వనజీవిగా గుర్తింపు పొందారు. ఆయన ఇప్పటివరకు 3 కోట్ల మొక్కలు నాటడం ఆషామాషీ విషయం కాదు. పర్యావరణ హితం కోరి ఆయన చేపట్టిన కార్యాచరణ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సమాజం పట్ల ఆయన బాధ్యతను గుర్తించిన కేంద్రం పద్మశ్రీతో గౌరవించింది.

ఈ నెల 13న ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలోని తన నివాసంలో వనజీవి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ)కి తరలించారు. అప్పటినుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రామయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు ఆయన బంధువులు చెబుతున్నారు. రేపు డిశ్చార్జి చేసే అవకాశాలున్నాయని తెలిపారు. రేపు సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వనజీవి రామయ్య ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటుతారని తెలుస్తోంది.

More Telugu News