సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

16-02-2021 Tue 07:29
  • మళ్లీ 'సర్కారు..' షూటింగులో కీర్తి సురేశ్ 
  • చరణ్, శంకర్ సినిమాకి అనిరుధ్ సంగీతం
  • బాలకృష్ణ కోసం గోపీచంద్ సొంత కథ
Keerti Suresh off to Dubai for SVP shoot

*  మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న 'సర్కారు వారి పాట' చిత్రం రెండో షెడ్యూలు షూటింగ్ కూడా దుబాయ్ లోనే జరుగుతోంది. నేటి నుంచి జరిగే ఈ షూటింగు కోసం తాను దుబాయ్ వెళుతున్నట్టు హీరోయిన్ కీర్తి సురేశ్ పేర్కొంది. ఈ షెడ్యూలులో ఓ పాటను కూడా చిత్రీకరిస్తారట.
*  రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చనున్నట్టు తెలుస్తోంది.
*  ఇటీవల రవితేజతో 'క్రాక్' చిత్రాన్ని రూపొందించి హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తన తదుపరి చిత్రాన్ని బాలకృష్ణ హీరోగా చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. క్రాక్ లానే దీనిని కూడా తన సొంత కథతోనే గోపీచంద్ తెరకెక్కించనున్నట్టు సమాచారం.