Kodali Nani: ఈ కేసును లోతుగా విచారించాల్సి ఉంది: కొడాలి నాని పిటిషన్ పై హైకోర్టు

AP High Court adjourns Kodali Nanis petition hearing
  • పంచాయతీ ఎన్నికలు అయ్యేంత వరకు మీడియాతో మాట్లాడొద్దని నానిని ఆదేశించిన ఎస్ఈసీ
  • హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసిన కొడాలి నాని
  • సరైన వీడియో టేపులు అందించాలని ఆదేశించిన కోర్టు
పంచాయతీ ఎన్నికలు ముగిసేంత వరకు (ఈ నెల 21) మీడియాతో మంత్రి కొడాలి నాని మాట్లాడకూడదని గత శుక్రవారం ఎసీఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ హైకోర్టులో కొడాలి నాని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్షమని, వాటిని కొట్టేయాలని పిటిషన్ లో కొడాలి నాని కోరారు.

ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఎస్ఈసీ, కొడాలి నాని తరపు న్యాయవాదులు అందించిన వీడియో టేపులతో సంతృప్తి చెందలేదు. కొడాలి నానితో పాటు, ఎస్ఈసీ తరపు న్యాయవాది కూడా సరైన వీడియోలను ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసును లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని...  ఈ కేసులో కోర్టుకు సహాయపడేందుకు సాయంత్రంలోగా అమికస్ క్యూరీని నియమించనున్నామని చెప్పారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
Kodali Nani
YSRCP
Nimmagadda Ramesh
AP High Court

More Telugu News