YS Sharmila: షర్మిలపై అవాకులు, చెవాకులు మాట్లాడొద్దు: మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి

  • షర్మిలను కలిసిన కాంగ్రెస్ నేత రంగారెడ్డి
  • మర్యాదపూర్వకంగా కలిశానని వ్యాఖ్య
  • కాంగ్రెస్ నేతలు షర్మిలను విమర్శించడం సరికాదన్న రంగారెడ్డి
Ex MLC Magam Rangareddy meets Sharmila

తెలంగాణలో వైయస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె జిల్లాల వారీగా వైయస్ అభిమానులతో సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఆమె జిల్లాల పర్యటన కూడా ప్రారంభంకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను కూడా ఆమె చేపట్టబోతున్నారని తెలుస్తోంది.

మరోవైపు షర్మిలను ఈ రోజు మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కలిసి, చర్చలు జరిపారు. వైయస్, కిరణ్ కుమార్ రెడ్డిల సమయంలో ఆయన ఎమ్మెల్సీగా పని చేశారు. షర్మిలతో సమావేశానంతరం మీడియాతో రంగారెడ్డి మాట్లాడుతూ, మర్యాదపూర్వకంగానే ఆమెను కలిశానని చెప్పారు.

 షర్మిల గురించి కొందరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, అది సరికాదని అన్నారు. వైయస్ ఈ లోకంలో లేకపోయినా, వారి పిల్లలు ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నారని కితాబునిచ్చారు. వైయస్ ఎంతో మంది ప్రజాప్రతినిధులను తయారు చేశారని, తెలంగాణకు ఎన్నో మంచి పనులు చేశారని చెప్పారు. వైయస్ బతికున్నప్పుడు ఆయన కాళ్లు, ఏళ్లు పట్టుకుని తిరిగిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆయనను విమర్శించడం సరికాదని అన్నారు. షర్మిలపై అవాకులు, చెవాకులు మాట్లాడొద్దని తమ పార్టీ నేతలకు సూచిస్తున్నానని చెప్పారు.

More Telugu News