అవసరం తీరాక ఆడుకుంటారు... 'చావు కబురు చల్లగా' చిత్రంలో అనసూయ ఐటమ్ సాంగ్ 

15-02-2021 Mon 16:03
  • మాస్ డ్యాన్స్ తో రెచ్చిపోనున్న అనసూయ
  • అనసూయ ఫొటోలు విడుదల చేసిన చిత్రబృందం
  • కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా చిత్రం
  • ఆసక్తికరంగా ట్వీట్ చేసిన అనసూయ
Anasuya featuring a special song in Chaavu Kaburu Challaga

టెలివిజన్ రంగంలో యాంకర్ గా ఎంతో గుర్తింపు దక్కించుకున్న అనసూయ సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వంటి రోల్స్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా కార్తికేయ హీరోగా నటిస్తున్న 'చావు కబురు చల్లగా' చిత్రంలో మాస్ డ్యాన్స్ తో ఫ్యాన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఐటమ్ సాంగ్ లో అనసూయ లుక్కు ఎలా ఉంటుందో చిత్రబృందం విడుదల చేసిన ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. కౌశిక్ దర్శకత్వం వస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది.

అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'చావు కబురు చల్లగా' చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వస్తోంది.

కాగా, తన మాస్ సాంగ్ పై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన పోస్టుపై అనసూయ ఊర మాస్ లెవల్లో స్పందించింది. "అవసరమని వేడుకుంటారు.... అవసరానికి వాడుకుంటారు... అవసరం తీరాక ఆడుకుంటారు" అంటూ పాట తీరుతెన్నులను చెప్పకనే చెప్పింది.