Vijay Rupani: వేదికపై కుప్పకూలిన గుజరాత్ సీఎంకు కరోనా పాజిటివ్

 Gujarath CM Vijay Rupani who fainted on stage tested corona positive
  • సభలో మాట్లాడుతూ వేదికపై పడిపోయిన విజయ్ రూపానీ
  • వెంటనే అహ్మదాబాద్ ఆసుపత్రికి తరలింపు
  • వైద్య పరీక్షల్లో కరోనా నిర్ధారణ
  • సీఎం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్న వైద్యులు 
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ వడోదరాలో ఓ సభలో మాట్లాడుతుండగా వేదికపైనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. అస్వస్థతతో ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అలిసిపోయి సొమ్మసిల్లి పడిపోయారని బీజేపీ శ్రేణులు తొలుత పేర్కొన్నాయి. అయితే సీఎం విజయ్ రూపానీకి కరోనా పాజిటివ్ అని తాజాగా వెల్లడైంది. వేదికపై స్పృహ కోల్పోయిన ఆయనను హుటాహుటీన హెలికాప్టర్ ద్వారా అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

ప్రస్తుతం ఆయన అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం రూపానీ కరోనా బారినపడినట్టు ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఈసీజీ, సీటీ స్కాన్ రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని, ఆందోళన కలిగించే పరిస్థితులు ఏమీ లేవని యూఎన్ మెహతా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్కే పటేల్ వెల్లడించారు.
Vijay Rupani
Corona Virus
Positive
Ahmedabad
Gujarath

More Telugu News