'లవ్‌ ఈజ్‌ ఇన్‌ ద ఎయిర్'‌ అంటూ తన లేటెస్ట్ ఫొటోను పోస్ట్ చేసిన సింగ‌ర్ సునీత!

15-02-2021 Mon 13:39
  • మాల్దీవుల్లో సునీత‌
  • మోడ్ర‌న్ లుక్‌  ఫొటో
  • అల‌రిస్తోన్న పిక్, వీడియో
sunita pic goes viral

'లవ్‌ ఈజ్‌ ఇన్‌ ద ఎయిర్‌' అంటూ సింగ‌ర్ సునీత తన ఫొటోను పోస్ట్ చేశారు. ఆమె మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆమె ప్ర‌స్తుతం మాల్దీవుల్లో ప‌ర్య‌టిస్తూ టూర్ ను ఎంజాయ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో స్టైలిష్ లుక్‌తో ఫొటో తీసుకుని ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ఆమె  ఈ పోస్ట్ చేశారు.

మోడ్రన్ లుక్‌లో ఉన్న ఈ ఫొటో నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తోంది. మాల్దీవుల్లో స‌ముద్ర అందాల  నేపథ్యంలో ఆమె జాలీగా గ‌డుపుతుండ‌డంతో ఆమె ఎక్క‌డికి వెళ్లార‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఎక్క‌డున్నాన‌న్న విష‌యాన్ని మాత్రం ఆమె చెప్ప‌లేదు. అలాగే అక్కడి స‌ముద్ర దృశ్యాల‌ వీడియోను కూడా ఆమె పోస్ట్ చేశారు.