కొత్త డైరెక్టర్ తో నందమూరి కల్యాణ్ రామ్ నూతన చిత్రం ప్రారంభం

15-02-2021 Mon 13:08
  • రాజేంద్ర దర్శకత్వంలో కల్యాణ్ రామ్
  • రాజేంద్రకు ఇదే తొలి చిత్రం
  • మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా
  • మార్చి 2వ వారం నుంచి షూటింగ్
Nandamuri Kalyanram new movie launched

టాలీవుడ్ హీరో నందమూరి కల్యాణ్ రామ్ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించాడు. కొత్త డైరెక్టర్ రాజేంద్ర దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇది కల్యాణ్ రామ్ కు 19వ చిత్రం. ఇందులో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. రాజేంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. స్క్రిప్టుపై నమ్మకంతోనే కల్యాణ్ రామ్ ఈ చిత్రం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 2వ వారంలో ప్రారంభం కానుంది. ఇతర తారాగణం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది.