Bhuma Akhila Priya: బోయిన్ ప‌ల్లి పీఎస్‌కు ఏపీ మాజీ మంత్రి అఖిల‌ప్రియ‌!

akhila priya goes ps in kidnap case
  • కిడ్నాప్ కేసులో ప్ర‌ధాన నిందితురాలిగా అఖిల ప్రియ
  • పోలీస్ స్టేష‌న్ కు వ‌చ్చి రెండోసారి సంత‌కం
  • కోర్టు ఆదేశాల‌తో విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తున్నామ‌న్న అఖిల‌
కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ మ‌రోసారి బోయిన్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు వచ్చారు. కోర్టు ఆదేశాల మేర‌కు బోయిన్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ కు వ‌చ్చి ఆమె సంత‌కం చేయ‌డం ఇది రెండోసారి. సంత‌కం చేసిన అఖిల‌ప్రియ మీడియాతో మాట్లాడారు. కోర్టు ఆదేశాల‌తో తాము పోలీసుల విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తున్నామ‌ని చెప్పారు. భ‌విష్య‌త్తులోనూ విచార‌ణ‌కు పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. తాము ఈ కేసు విష‌యంలో ఎవ‌రితోనూ ఎలాంటి సంప్ర‌దింపులు జ‌ర‌పలేద‌ని వ్యాఖ్యానించారు.

కాగా, బోయిన్‌ప్లలి అపహరణ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న‌ భూమా అఖిలప్రియ 15 రోజుల క్రితం కూడా పోలీస్ స్టేష‌న్ కు హాజరై ఏసీపీ నరేశ్ రెడ్డి సమక్షంలో సంతకం చేసిన విష‌యం తెలిసిందే. ప్రతి 15 రోజులకోసారి పీఎస్‌కు హాజరై సంతకం చేయాలని సికింద్రాబాద్ కోర్టు ఆమెకు ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో ఆమె ఆ మేర‌కు న‌డుచుకుంటున్నారు.
Bhuma Akhila Priya
Telugudesam
kidnap

More Telugu News